Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చాంద్రాయణగుట్ట
తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ రెజ్లర్ పి.నిఖిల్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన సబ్ జూనియర్ కుస్తీ పోటీల్లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నేతత్వంలో పోటీపడ్డాడు. ఈ పోటీల్లో పురానాపూల్ గొలకిడికిలోని జైభవానీ వ్యాయామశాలకు చెందిన నిఖిల్ యాదవ్ 60కేజీల విభాగంలో బ్రాస్ మెడల్ సాధించి విజేతగా నిలిచాడు. ఈ సుదర్భంగా నిఖిల్ యాదవ్ మాట్లాడుతూ.. జై భవానీ వ్యాయామశాల గురువు అర్జున్ యాదవ్, పహిల్వాన్ జైహింద్ యాదవ్ పహిల్వాన్ ఆభిమన్యు యాదవ్‌ల శిక్షణలో తాను కుస్తీ పోటీల్లో సరికొత్త మెళుకువలను నేర్చుకున్నానని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ, ఒలంపిక్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమంచ పటంలో నిలిపేందుకు కషి చేస్తానని అన్నారు. తాను ఈ విజయం సాధించడానికి పూర్తి సహకారం అందించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆరుణ్ యాదవ్, జైహిం డెయ్యాదవ్, అభిమన్యు యాదవ్‌కు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.