Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్సీసీ గేట్ వరకు 2కె రన్ నిర్వహించారు. మహనీయులు అందించిన స్ఫూర్తితో విద్యా రంగంలో విద్యార్థులు ముందుకు పోవాలని సూచించారు. కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, కొల్లూరు వెంకట్, ఓయూ అధ్యక్షుడు గుమిడేల్లి తిరుమలేష్, ఓయూ రిజిస్ట్రార్ సీహెచ్ గోపాల్ రెడ్డి, చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్ రావు, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొట్టపెంజర రమేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంచాల యాదగిరి, జోగు దశరథ్, హరిబాబు, విద్యార్థి నాయకులు చింతం తిరుపతి, శాగంటి రాజేష్, వరిగడ్డి చందు, తప్పెట్ల ప్రవీణ్, జెన్నారపు జీవన్, ధర్మారపు శ్రీకాంత్, ఎల్ నాగరాజు, మోగిలిపక కిరణ్, కానుగంటి సురేష్, మేడి నరేష్, గణేష్, అశోక్, మేడి నాగరాజు పాల్గొన్నారు.