Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నోటిఫికేషన్లు విడుదల చేయకుండా ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని కుత్బుల్లాపూర్ మండల ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఎం.చంద్రకాంత్ విమర్శించారు. సోమవారం కుత్బుల్లాపూర్ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగి సునీల్ నాయక్ ఆత్మహత్య కాదని, మూమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు, విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందన్నారు. బూటకపు వాగ్ధానాలతో అధికారంలొకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాల పాలనలో ఒక ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో తీవ్ర ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు గణేష్, సంతోష్, నరేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.