Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ ఎస్. వేణుగోపాలాచారి
నవతెలంగాణ-కల్చరల్
నాటి సినిమాల్లో ఉత్తమ సాహిత్యం, మధుర సంగీతం ప్రేక్షకులకు సందేశంతో పాటు ఆనందం కలిగించేవని, నేడు సంగీత ప్రాధాన్యతగల చిత్రాలు రావాలని తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి (ఢిల్లీ) డాక్టర్ ఎస్. వేణుగోపాలాచారి అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలో సోమవారం కళానిలయం సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రఖ్యాత సంగీత దర్శకులు కేవీ మహాదేవన్ జయంతి సందర్భంగా వర్థమాన దర్శకుడు గోపి సుందర్ సత్కార సభ జరిగింది. ముఖ్య అతిథిగా వేణుగోపాలాచారి పాల్గొని మాట్లాడుతూ... గోపి సుందర్ యువకుడు యువతకు నచ్చే సంగీతాన్ని సినిమాల్లో అందిస్తారని, కానీ అదేసమయం బీట్స్ కాకుండా మనస్సుకు హత్తుకునే సంగీతాన్ని కూడా అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ పూర్వ సభాపతి ఎస్. మధుసూదనాచారి శాలువా, మాలలతో గోపి సుందర్‌ను సత్కరించి జ్ఞాపిక బహుకరించారు. వేదికపై నాట్య గురువు భారతి, సామాజిక సేవకులు ప్రజాపతి, సినీ దర్శకులు విరించి వర్మ, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. సంస్థ స్థాపకుడు సురేందర్ స్వాగతం పలికారు. కార్యక్రమానికి తొలుత బాపిరాజు నిర్వహణలో నర్మద, రేవతి, నాగ రాజు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.