Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
వేసవి కాలంలో ప్రజల దాహార్థిని తీర్చడానికే స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షనీయమని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మ రెడ్డి అన్నారు. సోమవారం బడంగ్పేట్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో బాల కోటమ్మ సేవా ట్రస్టు రోమా 2 ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కార్పొరేటర్ భీమిడి స్వప్న జంగారెడ్డితో కలిసి ప్రారంభిచారు. కార్యక్రమంలో చలివేంద్రం నిర్వాహకులు, నాయకులు పెద్దబ్బావి ఆనంద్ రెడ్డి, కృష్ణ, రాజ్ కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.