Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
చింతల్ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్ సంక్షేమ సంఘం ఎన్నికలు ఆదివారం ఉత్కంఠభరితంగా ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి గొడుగు గుర్తుపై పోటీ చేసిన డి.అల్లాబకాష్‌కు 773 ఓట్లు రాగా, ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన శ్యామలమ్మకు 699 ఓట్లు వచ్చాయి. మాస్క్ గుర్తుపై పోటీ చేసిన సీహెచ్ నరేష్‌కు 637 ఓట్లు, ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన రాఘవేంద్రస్వామికి 651 ఓట్లు, చైర్ గుర్తుపై పోటీ చేసిన శ్రీనివాస్‌రెడ్డికి 367 ఓట్లు , ప్రధాన కార్యదర్శిగా పోటి చేసిన వరదరాజుకు 413 ఓట్లు పోలయ్యాయని హడక్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా అల్లాబాకాష్ తన ప్రత్యర్థి నరేష్‌పై 136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా కె.శ్యామలమ్మ తన ప్రత్యర్థి రాఘవేంద్రస్వామిపై 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని తెలిపారు. అనంతరం జీడిమెట్ల సీఐ కె.బాలరాజు, హడక్ కమిటీ సభ్యులు అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన అల్లాబకాష్, శ్యామలమ్మలకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కె.ఎం.ప్రతాప్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో హడక్ కమిటీ సభ్యులు బి.సత్యం, బి.రవీందర్‌రెడ్డి, జి.ప్రభాకర్, టి.మణి, జి.సుభాష్, కె.భూమయ్య, ఎన్.దేవయ్య, ఎ.రవీందర్, ఎస్.వెంకటేష్, టి.శ్రీను, డి.సునీల్ తదితరులు పాల్గొన్నారు.