Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ నేతలు వీఎస్ బోస్, ఈటీ నరసింహ
నవతెలంగాణ-నారాయణగూడ
స్వతంత్య్ర సమరయోధుడు, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల విజేత అయిన బాబు జగ్జీవన్ రామ్ నిజమైన ప్రజాస్వామ్యవాది అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహలు కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా సోమవారం బషీర్ బాగ్ లో ఉన్న ఆయన విగ్రహానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్య్ర సంగ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ చాలా చురుకైన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో అనేక సత్యాగ్రహాల్లో పాల్గొని దేశ స్వతంత్రం సిద్దించడానికి తోడ్పడ్డాడని తెలిపారు. సామాజిక సంస్కరణల కోసం పోరాడటమే కాకుండా, దళితులకు ఓటు హక్కు, రాజకీయ ప్రాతినిధ్యానికి డిమాండ్ చేసి సాధించారని గుర్తు చేశారు. నిరుపేద, అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా కషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ దేశంలోని నేటి సమాజానికి ప్రేరణ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల రాజ్ కుమార్ పాల్గొన్నారు.
'బాబు జగ్జీవన్ రామ్ సేవలు ఎనలేనివి'
దళిత జాతి ముద్దు బిడ్డ, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివని భారత జాతీయ లోక్ దళ్ పార్టీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పుల్లూరు వెంకట రాజేశ్వరరావు అన్నారు. దళిత వర్గాల సంక్షేమం కోసం చివరి వరకు కషి చేసిన మహనీయులు అని కొనియాడారు.ఈ మేరకు సోమవారం హిమాయత్‌నగర్ లోని పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు డి.నాగేందర్, గోవర్ధన్, రేవంత్ రెడ్డి, బండి రాయమల్లు, గంగుల శ్రీధర్, పొద్దుటూరి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.