Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
బాబు జగ్జీవన్‌రామ్‌ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కార్మిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధి శివారెడ్డిగూడ చౌరస్తావద్ద సోమవారం బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం 11వ వార్డు కౌన్సిలర్ కడుపొల మల్లేష్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయం అన్నారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ముళ్లి పావనీ జంగయ్య యాదవ్, ఎంపీపీ ఏలూరు సుదర్శన్ రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మెన్ పలుగుల మాధవరెడ్డి, పోచారం వైస్ చైర్మెన్, రెడ్యా నాయక్ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కొంతం అంజి రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఆర్కేపురంలోని బీజేఆర్ భవనంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మురుకుంట్ల ఆరవింద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి బేర బాలకిషన్, ఖిల్లా మైసమ్మ దేవాలయ చైర్మెన్ గొడుగు శ్రీనివాస్, ఆకుల ఆరవింద్, రమేష్ గుప్త, పెంబర్తి శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీమన్నారాయణ, జహీద్, వాహేదు పటేల్, ఊర్మిళ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.