Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్
నవతెలంగాణ - చాంద్రాయణగుట్ట
రానున్న పండగలు, ఉత్సవాలకు సమస్యలు తలెత్త కుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ ఎంసి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ తెలిపారు. జోనల్ పరిధిలోని పలు ముఖ్యమైన అంశాలపై చాంద్రాయణగుట్ట నరికిపూల్ బాగ్‌లోని జోనల్ కార్యలయంలో మంగళవారం సాయంత్రం డిప్యూటీ కమిషనర్లు, ఏఎమ్హెచ్వోలు, ఎస్ఈ, ఈఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న రంజాన్, ఉగాది, హనుమాన్ జయంతి ఉత్సవాలకు పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి కషి చేస్తున్నామన్నారు. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రతీ సర్కిల్‌కు ఒక్క ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు . చెత్త తరలించే వాహనాలకు సమస్యలు రాకుండా ప్రతీ సర్కిల్‌కు మూడు సెకాండారి కలెక్షన్ ట్రాస్పోర్ట్ పాయింట్ (ఎస్‌సిటి పీ)లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఏంటోమోలోజి సిబ్బందితో సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయిస్తున్నా మన్నారు. ఎక్కడా పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చుస్తున్నామన్నారు.సమావేశంలో మలక్‌పేట్, చార్మినార్, ఫలక్ నుమా డిప్యూటీ కమిషనర్లు జి .రజనీకాంత్ రెడ్డి, ఎస్ఎన్ సూర్య కుమార్, డి. జగన్, ఎస్ఈ బి. నర్సింగ్ రావు, ఈఈ లు కిష్టప్ప , రాములు, రాధికా, రవాణా విభాగం డిసిటిఓ వినరు భూషణ్, ఏఎంహెచ్ఓలు డాక్టర్ కె. వి శివ ప్రసాద్, డాక్టర్ పాల్వాన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.