Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొవిడ్‌తో ఉపాధిలేక, మంచానికి పరిమితమై భర్తకు మందులు కొనలేక, కుటుంబం గడవక తీవ్ర ఇబ్బందులు
- ఆవేదనలో ఓ కుటుంబం
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
అయ్యా మా కుటుంబాన్ని ఆదుకోండని ఓ ఇల్లాలు మంచానికి పరిమితమైన భర్తకు సపర్యలు చేసుకుంటు, ఇద్దరు కూతుళ్లకు ఉన్నత చదువులు చదివించలేక, పనులకు పంపించలేక నెలనెల మందులు కొనలేక ఓ తల్లిగా, భార్యగా కుంటుంబాన్ని నెట్టుకురాలేక ఆవేదన చెందుతున్న ఓ మహిళా దీనగాధ. వివరాలలోకి వెళ్తే... ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామానికి చెందిన సుంచు రమేష్ ఒక్కప్పుడు వివిధ వ్యాపారాలు చేస్తు ఇద్దరు కూతుళ్లను చదివించుకుంటూ కుటుంబం ఆనందంగా సాగుతున్న తరుణంలో గత మూడు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చి కాలు, చేతులు పడిపోయి ఆస్పత్రిలో రెండు నెలలకు పైగా అత్యవసర చికిత్స తీసుకొని, ఉన్నదంతా ఆస్పత్రిలో పెట్టి, బతికితే చాలు అనుకొని ఇంటికి తీసుకు వచ్చి జీవచ్చవంలా మంచానికి పరిమితమైన భర్తకు అన్ని తానై మంజుల సపర్యలు చేస్తువస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఆకాంక్ష, ఆర్తిలు ఉన్నత చదువులు చదివించాలని లక్ష్యంతో ఉన్న రమేష్‌కు పక్షవాతంతో మంచానికి పరిమితమై పిల్లల చదువులు అర్థ్ధాంతరంగా నిలిచి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా వెనుకడుగు వేయకుండా భర్తను చూసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ గ్రామ పెద్దల సహకారంతో ఇద్దరు కూతుళ్లను చదివిస్తున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటు ప్రతి నెల మందులకు దాదాపు 6వేల రూపాయలు ఖర్చు చేస్తు గ్రామ పెద్దల సహకారంతో ముందుకు సాగుతున్న తరుణంలో గత సంవత్సరం నుండి కొవిడ్ లాక్ డౌన్‌తో వీరి ఇబ్బందులు మరింత పెరిగిపోయి.
కొంతం వెంకట్ రెడ్డి, సర్పంచ్ కాచవాని సింగారం :
గత కొన్ని ఏళ్ళుగా భర్త రమేష్ మంచాన పడడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుం దని గుర్తించి నా వ్యక్తి గతంగా సహయ సహకారాలు అందిస్తూ వస్తున్నాను. ప్రతి నెల మందుల ఖర్చులకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాతలు ముందుకు వచ్చి రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాను.