Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
నాచారం డివిజన్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉదరు కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక మైలురాళ్ళు దాటుతూ బీజేపీి నేడు కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారాన్ని చేపట్టడం ప్రజా సంక్షేమానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ బీజేపీ నాయకులు అనిత పద్మారెడ్డి, ప్రకాష్, పోతగాని గోపాల్ గౌడ్, రాగిరి మోహన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, లక్ష్మణ్, శ్రీధర్‌రెడ్డి, యాదగిరి, యోగేశ్వర్ రెడ్డి, అన్వర్ పాల్గొన్నారు.