Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ
నవతెలంగాణ-హైదరాబాద్
కార్మిక రాజ్య భీమా (ఈఎస్ఐ) ఆస్పత్రిలో కార్మికులకు మందుల కొరత రాకుండా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సహకారంతో చొరవ తీసుకుంటున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. నాచారం నోడల్ సెంటర్, ఇఎస్ఐ డిస్పె న్సరీ హాస్పిటల్కు మందులు సరఫరా చేయడం జరిగిందని వెల్లడించారు. రోగులు మందులకు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ సహకారంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సరిపడ మందులను అందించే విధంగా కషి చేస్తామని తెలిపారు. క్యాన్సర్, కిడ్నీ సంబంధించిన రోగులకు ప్రతినెల సరిపడా మందు లను అందించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుం టున్నామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఈఎస్ఐ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నదనటానికి నిదర్శనం కార్మిక రాజ్య బీమా ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీ మందులను సరఫరా చేయడమే అన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి సరిపడా మందులు అందిస్తూ కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకు సహకరిస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.