Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
విద్యాసంస్థలను వెంటనే ప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మండలంలో ఏఐఎస్ఎఫ్ 3వ మహా సభను శ్రీ చైతన్య కళాశాలలో మంగళవారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే విద్యా సంస్థలను రీఓపన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎవ్వరికీ రాని కారోనా ఒక్క విద్యార్థులకే వస్తుందా అని ప్రశ్నించారు. కారోనా సమయంలో ఎన్నికలు జరుపుకోవచ్చు కాని విద్యార్థులు చదువుకుంటే కరోనా సమస్య గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. 3 నెలలు తరువాత పాఠశా లలు ప్రారంభించడం వలన ప్రయివేటు, కార్పొరేట్, పాఠశాలలు టీిచర్లకు జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ప్రయివేటు ఉపాధ్యాయులను అదుకోవాలని మరోపక్క పోరాడి సాధించుకున్న తెలంగా ణలో ఉద్యోగాల కోసం ఆత్మ బలిదానాలు చేసుకోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.ఉమామహేష్, ఎం.డి. అన్వర్, నాయకులు చిన్న, హరీష్, అజరు, అరవింద్, వినోద్, సాయి, దుర్గాప్రసాద్, సందీప్, ప్రజా నాట్య మండలి నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక :
అధ్యక్షులు ఆదిత్య, ప్రధానకార్యదర్శి వంశీ, ఉపాధ్యక్షుడు అజరు, కోశాధికారి రవి, సంయుక్త కార్యదర్శి వి.సాయి, సహాయకార్యదర్శి ప్రదీప్, కార్యవర్గ సభ్యులు కేశవ్, ప్రశాంత్, ధీరజ్, దుర్గాప్రసాద్, అర్జున్, కౌన్సిల్ సభ్యులు నిఖిల్, వినరు, భారత్, ఉదరు, వేణు, రవీకంత్, రమేష్‌లను ఎన్నుకున్నారు.