Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెక్నాలజీతో నేరాల నియంత్రణ
- సీపీ అంజనీ కుమార్
నవ తెలంగాణ-ఓయూ
సీసీ కెమెరాల ఏర్పాటుకు తమవంతు కృషి చేస్తానని డిప్యూటీ స్పీకర్ టి.పద్మరావు పేర్కొన్నారు. మంగళ వారం రాత్రి తార్నాక ప్రాంతంలోని గోకుల్ నగర్, రవీంద్రనగర్, వినోభ నగర్లలో అయిన నగర సీపీ అంజనీ కుమార్‌తో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.1.85 కోట్ల మేరకు నిధులను కేటాయించానని పద్మారావు చెప్పారు. చిలకలగూడ పోలీసు స్టేషన్‌కు తొలి విడతలో రూ.60లక్షలు, తుకారం గేటు పోలీసు స్టేషన్‌కు రూ.25లక్షలు, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌కు రూ.6.25లక్షలు, లాలాగూడ పోలీసు స్టేషన్ రూ.25లక్షలు కేటాయించి, సిసి కెమెరాల ఏర్పాటును పూర్తి చేయించామన్నారు. రెండో విడతలో ఈ నాలుగు పొలీసు స్టేషన్లకు కలిపి మరో రూ.50లక్షలు కేటాయించామని చెప్పారు. నేరాల నివారణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని పేర్కొ న్నారు. వంద మంది పోలీసులు చేసే పనిని ఒక్క సీసీ కెమెరా చేస్తుందని, అందుకే కెమెరాల ఏర్పాటునకు తాను ప్రాధాన్యతను కల్పిస్తున్నానని తెలిపారు. తన అసెంబ్లీ అభివధి నిధుల నుంచి త్వరలోనే మరి కొన్ని నిధులను కేటాయిస్తున్నట్లు పద్మారావుగౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. నగర సీపీి అంజనీ కుమార్ మాట్లాడుతూ. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిం చారు. సీసీి కెమెరాల ఏర్పాటునకు అత్యధిక నిధులను కేటయించిన ప్రజాప్రతినిధులలో తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రథóమ స్థానంలో ఉన్నారని అన్నారు. టెక్నాలజీని అంది పుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగరంలో అనేక ప్రముఖ కంపెనీలు ఉన్నాయి అని, ఎంతో ప్రశాంత నగరం అన్నారు. లా అండ్ ఆర్డర్‌కు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, టీటీయూసీి రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి, కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్, ఓయూ ఇన్స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ పోలీసు అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.