Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-సుల్తాన్ బజార్
కింగ్ కోఠి, హైదరాబాద్ జిల్లా ఆసుపత్రిలో 15 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆసుపత్రి కోవీడ్-19 ఇన్చార్జి డాక్టర్ మల్లికార్జున తెలిపారు. మంగళవారం కింగ్ కోఠి హైదరాబాద్ జిల్లా ఆస్పత్రిలో 215 మందికి కరోనా పరీక్షలు చేశామని, 15 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చుకున్నామన్నారు. ప్రస్తుతం 158 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పురుషుల ఐసోలెషన్లలో 76 మంది, స్త్రీల ఐసోలేషలో 32 మంది చికిత్స పొందుతున్నారు. ఐసీయు వార్డులో 38 మందికి చికిత్స లు అందిస్తున్నామని తెలిపారు.