Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వే నెంబర్ 63లో కొనసాగుతున్న కబ్జా, అక్రమ నిర్మాణాలు
- పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ-బోడుప్పల్
మేడ్చల్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని సం బంధిత అధికారులు పదే పదే చెప్తున్నా... బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 63/26 నుండి 63/38 వరకు గల ప్రభుత్వ భూమిలో మాత్రం యుథేచ్ఛగా ఇండ్ల నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇక్కడి హెచ్‌పీ పెట్రోల్ బంకు, కొండ ఎల్లమ్మ ఆలయం ఎదురుగా చేపట్టిన ఓ నిర్మాణం కేవలం రెండు రోజుల్లోనే పూర్తి అయ్యిందంటే రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో కూడా అనేక మార్లు సర్కారు భూముల పరిరక్షణ కోసం ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచి, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. అదే విధంగా సమీకత కార్యాలయం నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కళాభవన్, క్రీడా మైదానం ఏర్పాటు కోసం జాగాను కేటాయిస్తున్నట్లు గతేడాది మంత్రి మల్లారెడ్డి స్వయంగా ప్రకటించారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ స్థలం కేటాయింపు అంశం మాత్రం కనుమరుగైందనే చెప్పవచ్చు.
నిర్మాణాలపై చర్యలుంటాయా?
సర్కారు భూముల పరిరక్షణకుగాను కఠినమైన నిర్ణయాలు ఉంటాయని గతంలో జిల్లా అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, అర్డీవో, మేడిపల్లి మండల తహసీల్దారు ప్రకటించారు. అయితే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ అనుమతి లేని నిర్మాణాలను ప్రోత్సహిన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమి ఎంతుందో సర్వే చేసి అక్రమంగా చేపట్టిన ఇండ్లను తొలగించి సదరు భూములను అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
- రాపోలు ఉపేందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు, బోడుప్పల్ కార్పొరేషన్
రాజకీయ నాయకుల ప్రోద్భలంతోనే నిర్మాణాలు
సుమారు 57 ఎకరాల సర్కారు భూమి ఒక్కరోజులోనే కబ్జాకు గురి కాలేదు. దీనివెనుక బోడుప్పల్ కార్పొరేషన్‌కు చెందిన మహామహులు రాజకీయ నాయకులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాగితాలతో ఉన్న ప్రభుత్వ భూమి కండ్ల ముందు కనపడకపోతే.. సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలి.
- సీపీఐ(ఎం) మేడిపల్లి మండల కార్యదర్శి ఎన్.సజన