Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
ప్రియుడితో భార్య భర్తను హత్య చేయించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం వెస్ట్ జోన్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి వివరాలను వెల్ల డించారు. ఏప్రిల్ ఫస్టున మహమ్మద్ అతిక్ తన త మ్ముడు మహమ్మద్ సిద్దిక్ అహమ్మద్ (40) కూకట్ పల్లిలో టైలరింగ్ చేస్తూ జీవిస్తున్నాడని, అయితే రెండు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన తమ్ము డి భార్య రుబీనా (25), ఆమె ప్రియుడు, మెకానిక్ అయిన మొహమ్మద్ అలీ (22)పై అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మొహమ్మద్ సిద్దిక్ అహమ్మద్ ఉంటున్న ఇంటియజమాని లోపలి నుంచి దర్వాసన వస్తుందని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వెళ్లిచూశారు. ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి చూడగా మొహమ్మద్ సిద్దిక్ వంటగదిలోని ఫ్రిజ్‌లో ఇరుక్కుపోయి, మృతి చెంది కనిపించాడు. ఎవరో హత్యచేసి అతడిని ఫ్రిజ్ లో కుక్కి ఉండవచ్చని అనుమానించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు మహమ్మద్ అలీని, మతుడి భార్య రుబీనాను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. 18 నెలల క్రితం మృతుడు మొహమ్మద్ సిద్దిక్ తన భార్య రుబీనా, మహమ్మద్ అలీతో తన ఇంటిలోనే అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ సమయంలో నిందితుడిని కొట్టి వదిలి వేశాడు. తన భార్యను కూడా హెచ్చరించి, ఇద్దరు పిల్లలు ఉన్నారని, పద్దతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఎలాగైనా తన భర్తను హత్య చేయాలని భార్య రుబీనా తన ప్రియుడు మహమ్మద్ అలీపై ఒత్తిడి తెచ్చింది. అయితే మార్చి 28న మొహమ్మద్ సిద్దిక్ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తగారింట్లో భోజనం చేశాడు. తర్వాత ఒంటరిగా ఇంటికి వెళ్లాడు. తన భర్త్త్త ఒంటరిగా ఇంట్లో ఉన్నాడనే విషయాన్ని రుబీన తన ప్రియుడు మహమ్మద్ అలీకి తెలియ జేసింది. దీంతో అతను రాత్రి రెండుగంటల సమయ ంలో ఐరన్‌రాడ్ తీసుకుని సిద్దిక్ ఇంటికి వెళ్లాడు. తలు పు కొట్టగా గాఢనిద్రలో ఉన్న సిద్దిక్ తీయలేదు. దీంతో మొహమ్మద్ అలీ స్క్రూ డ్రైవర్‌తో కిటికీని తొలగించి లోపలకు ప్రవేశించాడు. నిద్రిస్తున్న మొహమ్మద్ సిద్దిక్‌ను రాడ్‌తో తలపై మూడు సార్లు గట్టిగా కొట్టట గా తీవ్ర రక్తస్రావం అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కొట్టిన నిందితుడు ఆ రక్తం మరకలను శుభ్రం చేసి, మతదేహాన్ని వంటగదిలోని ఫ్రిజ్‌లో ఉంచి, బ యటి నుంచి ఇంటికి తాళం వేసి, మృతుడికి చెందిన యాక్టివా బండి తీసుకుని వెళ్లిపోయాడు. హత్యకు వినియోగించిన ఐరన్ రాడ్‌ను విజేత థియేటర్ ఎదు రుగా గల మురికి కాలువలో వేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు, నిందితులవద్ద నుంచి హత్యకు వినియోగించిన ఐరన్‌రాడ్‌ను, టీవీఎస్ జుపిటర్ బైకు అండ్ హీరో హోండా ఫ్యాషన్ బైకు, రెండు సెల్ఫో న్లు స్వాధీనం చేసుకుని నిందితుడు మహమ్మద్ అలీని, అతనికి సహకరించిన మతుడి భార్య రుబీనా ను అరెస్ట్‌చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.