Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపేరుతో అన్ని విద్యాసంస్థలను తాత్కా లికంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకో వాలని ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఈటీఎల్ఎఫ్ సంఘాల డిమాండ్ చేశా యి. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉపాధ్యాయులకు, అధ్యాప కులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15వేల నిరుద్యోగ భతిని ఇవ్వాలని డిమా ండ్ చేస్తూ ఈసీఐఎల్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్ చిత్ర పటానికి వినూత్న పద్దతిలో రక్తాభిషేకం కార్యక్రమం నిర్వహి ంచారు. ఈసందర్భంగా ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సత్యప్రసాద్, సహాయ కార్యదర్శి ధర్మేంద్ర, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు విశాల్ మాట్లా డుతూ రాష్ట్రంలో ఆన్ లాక్ లో భాగంగా విద్యాసంస్థలు ప్రారంభించే నాటికి ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీసం కరోనా నివారణ చర్యలకు శాని టేషన్, మాస్కులు, శానిటైజర్స్, థర్మల్ స్క్రీనింగ్ లాంటి వసతులకు ప్రభు త్వం ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా కొన్ని విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తి చెందిన వెంటనే రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థలు అన్నింటినీ మూసివేత నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రయివేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యా యులకు, అధ్యాపకులకు రూ. 15వేల నిరుద్యోగ భతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయివేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతి నిధి రామచందర్, ఎడ్యుకేషనల్ టీచర్స్ లెక్చరెర్స్ ఫోరమ్ జిల్లా కన్వీనర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల మూసివేత నిర్ణ యంతో ప్రయివేట్ విద్యాసంస్థల బాధలు వర్ణనాతీతం అని, ఒకవైపు టీచర్స్, అధ్యాపకుల నెలసరి జీతాలను చెల్లించలేక, బిల్డింగ్ ట్యాక్స్‌లను కట్టలేక నరకయాతన పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి పాఠశాలను పునప్రారంభించాలన్నారు.కేసీఆర్ చిత్రప టానికి రక్తాభిషేకం చేస్తున్న నాయకులను అడ్డుకుని, అక్రమంగా అరెస్టు చేసి కుషాయిగూడ ఠాణాకు తరలించిన అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్, ఈసీఐఎల్ ప్రధాన కార్యదర్శి మహేష్,రాహుల్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రవి, నవీన్, కిరణ్, భారత జాతీయ మహిళా సమాఖ్య ఉప్పల్ మండల అధ్యక్షురాలు సుగుణ, కోశాధికారి రజినీ,. వివిధ పాఠశాలల, కళాశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ట్రస్మా జిల్లా సలహాదారు సత్యా రెడ్డి, భాను ప్రకాష్, నివేదిత, కిరణ్మయి, రమేష్, ప్రదీప్, భాస్కర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.