Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ బేస్ బాల్ క్రీడాకారులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కతిక శాఖ మం త్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 3 వరకు ఆంధ్రప్ర దేశ్‌లోని కర్నూల్ జిల్లా నంద్యాలలో జరిగిన 34వ సీనియర్ జాతీయ బేస్ బాల్ ఛాంపి యన్ షిప్లో తెలంగాణ జట్టు ఢిల్లీ జట్టుపై 11 - 6 పాయింట్లతో విజయం సాధించి జాతీ య ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న సందర్భంగా తెలంగాణ బేస్ బాల్ అసోసి యేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా హరిశంకర్ నేత త్వంలో వచ్చిన క్రీడాకారులను హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మంగళవారం తన కా ర్యాలయంలో మంత్రి క్రీడాకారులు, కోచ్‌లు, అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను క్రీడా హబ్‌గా తీర్చి దిద్దాలనే సంకల్పంతో రాష్ట్రంలో క్రీడా పాలసీని ప్రవేశపెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్ప టికే ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం, ఉన్న త విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లును అమ లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడాకారు లను ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు. ఈ కార్య క్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్వేత, ట్రెజరర్ కృష్ణ, కోచ్‌లు శ్రీకాంత్ మోగిలి, కృష్ణ, సాయికుమార్, మేనేజర్ రాహు ల్, క్రీడాకారులు, క్రీడాకారిణులు పాల్గొన్నారు.