Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
మండలంలోని చౌదర్‌గూడ గ్రామ పంచాయతీ ఆవరణంలో మంగళవారం తై బజార్ (వారాంతపు సంత) వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో మొత్తం 8 మంది పాల్గొనగా కట్ట నాగేష్‌గౌడ్ రూ.రెండు లక్షలకు పాడి తై బజారును దక్కించుకున్నారు. ఈ మేరకు రూ. రెండు లక్షల చెక్కును గ్రామ పంచాయతీలో మండల పం చాయతీ అధికారి అనంత లకిë, పంచాయతీ కార్యదర్శి మ ధుసూదన్రెడ్డికి చెక్కును అందజేశారు. గ్రామ పంచాయ తీకి ఆదాయం వచ్చే విధంగా ప్రతి ఏడాదీ తై బజార్ వేళం పాటను నిర్వహించనున్నట్టు గ్రామ పంచాయతీలో మొట ్టమొదటి సారిగా వేలం పాట నిర్వహించినట్టు తెలిపారు. ఈ తై బజార్ వేలం పాట 1.4.2021 నుంచి 31.3. 2022 వరకు అమలులో ఉంటుందనీ, ప్రతి ఏడాదీ ఆదాయ వనరులు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్ర మంలో మండల పంచాయతీ అధికారి అనంతలకిë, సర్పం చ్ బైరు రమాదేవి, పంచాయతీ కార్యదర్శి మధుసూ దన్‌రెడ్డి, ఉపసర్పంచ్ కుర్ర మహేందర్‌గౌడ్, ఎంపీటీసీ స భ్యుడు నీరుడి రామారావు, వార్డు సభ్యులు మంచాల సు ధాకర్, మంద స్వామిదాస్, బైరు లక్ష్మణ్, రాడమల్ల బోజి రెడ్డి, గ్రామ ప్రజలు, తదతరులు పాల్గొన్నారు.