Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతూ ప్లాట్లు కబ్జా చేస్తే ఊరుకునేది లేదనీ, బహిరంగ చర్చకు సిద్ధం కావా లనీ, బాధితులవి దొంగ పత్రాలని ఆరోపించే వారు వాటిని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాం గ్రెస్ మండలాధ్యక్షుడు కర్రె రాజేష్ సవాల్ విసిరారు. ఘట్ కేసర్ మండలం కాచవాని సింగారం నుంబం గ్రామం ముత్వెల్లి గూడ సర్వే నెంబర్ 1లోని ప్లాట్ల కబ్జాపై బాధితు లతో కలసి మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గడ్డం సత్తయ్య నుంచి శివరాజ్ కొనుగోలు చేశాడని చెప్పే వ్యక్తులు శివరాజ్ పట్టాదారులకు డబ్బులు చెల్లించనందున శివరాజ్ కొనుగోలు చెల్లదని పట్టాదారులు కోర్టులో కేసు వేయడంతో శివరాజ్ కొనుగోలు చెల్లదని కోర్టు తెల్చి చెప్పిందనీ, దీనికి కావాల్సిన రుజువులు ఉన్నాయని రాజేష్ తెలిపారు. ఇది సరైనది కాదని నిరూపిస్తే శాశ్వతంగా రాజ కీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. శివరాజ్ కొనుగోలు చెల్లనప్పుడు సంజీవరెడ్డి ఎలా కొంటాడనీ, ఆయన డాక్యూమెంట్ ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులను మచ్చిక చేసుకుని మాకు తిరుగు లేదనే విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిం చారు. గడ్డం సత్తయ్య నుంచి ఆనాడు కొంత మంది సాదా బైనామాల ద్వారా ప్లాట్లు కొనుగోలు చేశారనీ, వారికి గడ్డం సత్తయ్య నుంచి కొనుగోలు చేసినట్టు పత్రాలు ఉన్నాయని తెలిపారు. ఇంటి నిర్మాణానికి పిల్లర్లు వేస్తే వాటిని కట్ చేసి మట్టితో పూడ్చి ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించారు. సంజీవ రెడ్డికి పూర్తి హక్కులు ఉంటే రౌడీలు, గుండాలు ఎందుకని ప్రశ్నించారు. లేదంటే కోర్టు నుంచి పోలీసు బలగాలను పెట్టుకుని పని చేసుకోకుండా వందల మంది వీధి రౌడీల ను తీసుకొచ్చి బాధితులను బెదిరింపులకు గురిచేస్తు దాడు లకు సహితం తెగబడ్డారనీ, మహిళలు ఆని చూడకుండా దాడులు చేయడం సరికాదన్నారు. 15 రోజులుగా గుండా లు రౌడీల వీరంగంతో ముత్వెల్లి గూడ గ్రామస్తులు భయం దోళనలకు గురయ్యారని తెలిపారు. ప్లాట్ల యజమానులకు ఎలాంటి హక్కులేదని చెప్పే వారు వారికి తమ దగ్గరకు వస్తే సెటిల్ చేస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. సంజీవరెడ్డి గాని డెవలప్మెంట్కు అగ్రీమెంట్ చేసుకున్న వారు బాధితుల ప్లాట్లు అభివృద్ధి చేసుకోవాలనీ, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతోపాటే ఎక్కడికైన వెల్లడానికి సిద్దమని హెచ్చరించారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు రాయబండి నవీన్ పాల్గొన్నారు.