Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి నియోజవర్గానికి చెందిన ఓ యువకుడు సోమవారం ప్రశాంతి నగర్ లో విద్యుద్ఘాతానికి గురై మృతి చెందగా అదే ప్రదేశంలో మంగళవారం మరో యువకుడు కరెంట్ షాక్కు గురయ్యాడు. ఈ మేరకు విద్యుత్ ప్రమా దాలపై స్పందిస్తూ బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీంద ర్రెడ్డి, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ రావుతో కలిసి మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలిం చారు. ఈ ప్రమాదాలపై టీఎస్ఎస్పీడీసీఎల్ ఏఈ దుర్గా ప్రసాద్ పర్యవేక్షణలో ఘటనలకు గల కారణాలపై దర్యాప్తు చేయిస్తున్నారు. ముందస్తు దర్యాప్తులో భాగంగా విద్యుద్ఘా తానికి కారణమైన స్తంభం జియో ఇంటర్నెట్ సేవలు అం దించే స్తంభంగా గుర్తించారు. దీనికి విద్యుత్ సరఫరా ఎం దుకు అవుతుందో గుర్తించడానికి మరింత సమయం పడు తుందని ఏఈ దుర్గ ప్రసాద్ తెలిపారు. అనంతరం కార్పొ రేటర్ ఆవుల రవీందర్రెడ్డి ఘటనలో గాయ పడిన వ్యక్తిని ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం మృతి చెందిన సయ్యద్ ఆరీఫ్ కుటుంబాన్ని వారి నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.