Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆన్లైన్లో సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. ఉద్యో గాలిపిస్తామని కొందరు, లక్కీకూపన్స్ కొనుగోలు చేయా లని మరికొందరు అందినకాడికి దోచుకున్నారు. మరికొం దరు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదే తరహాలో ప్రముఖ ఏపీప్లస్ సంస్థలో ఉద్యోగాలున్నాయని నకిలీ నోటిఫికేషనను సోషల్‌మీడియా, ఆన్లైన్లో వైరల్ చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సైబర్ నేరస్థులు పలువురిని బోల్తా కొట్టించారు. బేగంపేట్‌లో ఏపీప్లస్ ఆయిల్ సంస్థ ఉంది. ఈ సంస్థకు ఇండియాతోపాటు ప్రపంచ వ్యాప్తం గా దాదాపు 70కి పైగా బ్రాంచ్‌లు ఉన్నాయి. అయితే ఖతార్, దుబారులో ఉద్యోగాలున్నాయని నకిలీ నోటిఫికే షన్ను సృష్టించిన సైబర్ నేరస్థులు దానిని వైరల్ చేశారు. నిజమేననుకొని సంప్రదించిన వారి సర్టిఫికెట్లను వెరిఫికే షన్ పేరుతో సేకరించారు. అనంతరం డిపాజిట్ల కింద ఒకొక్కరి నుంచి రూ.13,500లను వసూలు చేశారు. అం తటితో ఆగకుండా పదేపదే డబ్బులు డిమాండ్ చేస్తుం డటంతో అనుమానం వచ్చిన నలుగురు బాధితులు ఆ సంస్థను సంప్రదించారు. దాంతో అస్సలు విషయం వెలు గు చూసింది. అప్రమత్తమైన ఆ సంస్థ ప్రతినిధులు సీసీ ఎస్‌లో ఫిర్యాదు చేశారు. మరో కేసులో రుణాలిప్పిస్తా మంటూ మెహదీపట్నంకు చెందిన వ్యక్తి నుంచి రూ.86 వేలను దండుకున్నారు. అంతేగాక జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తికి తన గురువు పంపించినట్టుగానే సైబర్ నేరస్థులు నకిలీ మెయిల్ పంపించారు. అమెజాన్ షాపింగ్‌లో ఆఫర్ కూపన్లు కొనుగోలు చేయాలని సమాచారం ఇచ్చారు. ఒకొక్క కూపన్ ధర రూ.5 వేలు ఉంటుందని చెప్పారు. మాయమాటలతో రూ.3.30 లక్షల విలువగల 65 కూపన్లు కొనుగోలు చేయించారు. తీరా అనుమానం వచ్చిన బాధితుడు తన గురువును సంప్రదించగా తాను ఎలాంటి మెయిల్ పంపలేదని తేలింది. విషయం తెలుసు కున్న బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. రోజుకో తీరులో సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారని సైబర్‌క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నిర్ధారించుకోకుండా నమ్మొద్దని సూచించారు.