Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటర్ ఏటీఎంలు పని చేస్తలేవ్
- ఆర్భాటమే తప్పా ఆచరణ శూన్యం
- ప్రచారానికే పరిమిమైన వాటర్ ఏటీఎం కేంద్రాలు
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రజల దాహార్తి తీర్చాలని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంల లక్ష్యం నెర వేరడం లేదు. కాప్రా సర్కిల్ పరిధిలోని నాచా రం, మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల వద్ద, నాచా రం చౌరస్తా, స్నేహపురి మీసేవ కేంద్రంవద్ద 2018లో వాటర్ ఏటీఎం కేద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడవి పనిచేస్తలేవు. ఏర్పాటు చేసి ఏండ్లు గడుస్తున్నా 'నీళ్లొచ్చేది లేదు, గొంతు తడిసేది లేదు' అని పలువురు ఆవేదనగా విమ ర్శిస్తున్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజల దాహార్తిని తీర్చిన దాఖలాలు ఎక్కడా కనిపించ డం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఐదు వందల లీటర్ల సామర్థ్యంతో ప్రత్యేకమైన ప్యూరి ఫై మిషన్ అమర్చి అమెరికాకు చెందిన జోసెఫ్ సంస్థ, ఫేస్ గాడ్ సంస్థల ఆధ్వర్యంలో ఒక్క యూనిట్ రూ. 6.40 లక్షల వ్యయంతో నిర్మించా రు. ప్రభుత్వం సామాన్యునికి సంపూర్ణమైన ఆరో గ్యానికి స్వచ్ఛమైన నీరు అందించాలనే సంక ల్పంతో ఈ వాటర్ ఏటీఎంల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.
అసలే మండు వేసవి, దాహార్తి తీర్చుకోవడా నికి చలివేంద్రాలు, వాటర్ ఏటీఎంలు వంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కానీ వాటర్ ఏటీఎంలు మాత్రం పనిచేస్తలేవు. కనీసం ఇప్పుడైనా వాటిని ఉపయోగంలోకి తేవాలని ప్రజలు జీహెచ్ఎంసీని, ప్రభుత్వాన్ని కోరుతున్నా రు. బయట మార్కెట్లో ఒక్క వాటర్ బాటిల్ రూ. 20 పెట్టి కొనుక్కునే స్థోమతలేని సామాన్య ప్రజ లకు ఒక్క రూపాయితో లీటర్ మంచినీళ్లు అంది ంచే సౌకర్యాన్ని కల్పించిన జీహెచ్ఎంసీ అధికా రుల ఆలోచన అమలు చేస్తే ఎందరో బాట సారుల, ప్రజల దాహార్తి తీరుతుంది.
ప్రచార ఆర్భాటమేనా?
లక్షల రూపాయల ప్రజాధనంతో ప్రజల దాహా ర్తిని తీర్చేందుకు జీహెచ్ఎంసీ ఏరియాలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన ఏటీఎం వాటర్ ప్లాంట్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. రూపాయి కాయిన్ మెషిన్లో పెడితే టాప్ ఓపెన్ అవుతోంది. డబ్బులు మెషిన్ రిసీవ్ చేసు కుంటోంది కానీ నీళ్లు మాత్రం రావడం లేదు. ఇట్లయితే వాటర్ ఏటీఎం కేంద్రాలు ఎందుకని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఎం డాకాలం ఒక్కరూపాయికే చల్లని నీరు అందుబా టులోకి వస్తే ప్రజలు ఎంతో మేలు జరుగు తుంది. కాబట్టి వాటర్ ఏటీఎం సెంటర్లు పనిచే సేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతు న్నారు.
నిర్వహణపై నిర్లక్ష్యం
వాటర్ ఏటీఎం కేంద్రాల నిర్వహణలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు తమకు సంబంధం లేదంటే లేదని ఇరుశాఖలవారు పే ర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు వాటి నిర్వహణ చూసుకోవాలని మండలాధికారులు చెబుతుంటే.. మాకు సంబంధం లేదు.. పై అధికారులు ఏర్పాటు చేయాలంటే చేశాం అని జలమండలి అధికారులు, జీహెచ్ఎంసీ కిందిస్థాయి అధికారులు పేర్కొంటున్నారు.
నిర్వహణ మాది కాదు- ఈఈ కోటేశ్వరరావు
జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినవే కానీ వాటర్ ఏటీఎం కేంద్రాల నిర్వహణ మా పరిధిలోనికి రాదు. పై అధికారులు చెప్పారు. మేము జాగా చూపించాం. నిర్వహణతో మాకు సంబంధం లేదు.
మా పరిధిలోకి రావు - జలమండలి డీజీఎం కృష్ణ
వాటర్ ఏటీఎం కేంద్రాలు మా పరిధిలోకి రావు, వాటి ఏర్పాటు, నిర్వహణ మొత్తం జీహెచ్ఎంసీ అధికారులు చూసుకుంటారు. కేంద్రాలకు నీటి సరఫరా అవసరమై మమ్మల్ని సంప్రదిస్తే అందజేస్తాం తప్ప అంతకుమించి మాకు ఎటువంటి సంబంధం లేదు.