Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్లో ఉపాధి నిమిత్తం బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులను గుర్తించి అవసరమైన బడ్జెట్ కేటాయించాలని గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ వృత్తి సంఘాల కన్వీనర్ గుమ్మడిరాజు నరేష్ డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ రుణాల కోసం 2014-15లో 5.77లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 35వేల మందికే రుణాలు మంజూరు చేశారని, మిగిలిన 5.22లక్షల మందికి ఇంతవరకు నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రుణాలు మంజూరు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మత్య్సకార్మిక సంఘం నగర అధ్యక్షులు అర్వపల్లి శ్రీరాములు, కల్లుగీత కార్మిక సంఘం నగర అధ్యక్షులు ఎం.కృష్ణాస్వామి పాల్గొన్నారు.