Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ప్రముఖ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కన్సల్టింగ్, సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ కంపెనీ, ఇప్పుడు ఒడిశాలో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రపంచంలోనే ప్రముఖమైన, హైదరాబాద్ ప్రధాన కార్యాలయం కలిగిన 100 శాతం పర్యవేక్షణ సంస్థ అయిన అరేటియన్స్ ఒడిశాలోని భువనేశ్వర్లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. హైదరాబాద్, కొల్కతా, బెంగళూరు, చెన్నరులలో ప్రస్తుతం ఉన్న తన కార్యాలయాలతో పాటు నూతనంగా ఏర్పాటైన ఈ భువనేశ్వర్ కార్యాలయం భారతదేశంలో ఐదోవది. ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, ఇన్నోవేషన్ ల్యాబ్స్, స్ట్రాటజిక్ యాప్స్, అనలిటిక్స్, అడ్వైజరీ సర్వీసెస్ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్ వంటి రంగాలకు సంబంధించి నిపుణులైన టీమ్లు దీనిలో పనిచేస్తుండగా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ సింగాపూర్లలో ఉన్న కార్యాలయాలతో అరేటియన్స్ ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంటున్నది. ఈ సందర్భంగా అరేటియన్స్ వ్యవస్థాపకుడు సీఈవో మహేష్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ... 'భారతదేశంలో సరైన ప్రతిభను గుర్తించి, దానిని పెంపొందించడం పట్ల మాకున్న నిబద్ధతకు భువనేశ్వర్ కార్యాలయం వ్యూహాత్మకంగా ఉండనున్నది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే' అని అన్నారు.