Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్‌గౌడ్
నవతెలంగాణ-అంబర్‌పేట
నాలాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ఎప్పటికపుడు తొలగించాలని అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్‌గౌడ్ అధికారులకు సూచించారు. మంగళవారం డివిజన్లోని న్యూపటేల్‌నగర్‌లో పర్యటించి స్ధానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు ఓపెన్ నాలాలో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గందం వెదజల్లుతోందని, దోమలు వృద్ధి చెందుతున్నాయని కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజరుకుమార్గౌడ్ మాట్లాడుతూ ఓపెన్ నాలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ఎప్పటికపుడు తొలగించి శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సంబంధిత అధికారులు సమస్యను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో బస్తీవాసులతో పాటు టిఆర్ఎస్ నాయకులు దయాకర్యాదవ్, మహేష్ గంగపుత్ర, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.