Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) విభాగంలో 'భారత దేశంలో ఉగ్రవాదం- సమాజంపై దాని ప్రభావం' అనే అంశంపై ప్రొ సతీష్ చంద్ర పర్యవేక్షణ (గైడ్ షిప్) లో పరిశోధన గ్రంధాన్ని ఓయూ పరీక్షల విభాగానికి సమర్పించటంతో ఓరుగంటి కృష్ణకు ఓయూ డాక్టరేట్ ప్రధానం చేసినట్టు పరీక్షల విభాగం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓరుగంటి కష్ణ స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా, రాగంపేట గ్రామం. మలిదశ తెలంగాణ ఉద్యమకారుడైన కుమార స్వామి, కొమురమ్మ ల కుమారుడైన కష్ణ ఓయూలోనే పీజీ, పీహెచ్డీ పూర్తి చేయడం గమనార్హం. ఈసందర్భంగా కష్ణ తన గైడ్ సతీష్ చంద్ర, హెడ్ ప్రొ ముసలయ్య, గురువు ప్రొ కోదండరాం, రేవంత్ రెడ్డి, సీతక్క లకు కతజ్ఞతలు తెలియజేశారు.