Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అక్రమంగానల్లా కనెక్షన్ పొందిన ముగ్గురు వ్యక్తులపై జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మైలార్ దేవ్పల్లి పరిధిలోని టీఎన్జీవో కాలనీలో నివసిస్తున్న శివకుమార్ అనుమతి లేకుండా నల్లా కనెక్షన్ తీసుకున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీలో బయటపడటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జగద్గిరిగుట్ట పరిధిలోని పాపిరెడ్డినగర్లో నివాసం ఉంటున్న చందనారామ్ కూడా జలమండలి అనుమతి లేకుండా నల్లా కనెక్షన్ తీసుకున్నారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇదిలావుండా బోరబండ పరిధిలోని శివాజీ నగర్లో నివాసం ఉంటున్న మధు అనే వ్యక్తి జలమండలి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా రెండు నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీలో బయటపడ్డంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మధుపై సనత్నగర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నట్టు ఎవరైనా గుర్తిస్తే జలమండలి విజిలెన్స్ బృందానిక,ి లేదా 9989998100, 9989992268 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.