Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోతలపురం గ్రామంలో ఉంటున్న శేఖర్ (ఇతని స్వస్థలం ఎదులా బాద్ గ్రామం, ఘట్కేసర్ మండలం) నాగోల్‌లో అద్దె షెడ్లో ఉంటూ వెల్డర్‌గా పని చేసుకుంటున్నాడు. సంవత్సరం నుంచి మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు ఇంటికి రావాలని పిలిచినా వెళ్లకుండా దుకాణంలోనే ఉంటున్నాడు. తన తండ్రిని పునరావాస కేంద్రానికి పంపాడు. కానీ అతను మాత్రం తన వ్యసనాన్ని మానలేదు. కుటుంబ సభ్యులు అతనిని తాగడం మానేయాలని అడిగితే తాను ఇంటినుంచి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు. మంగళవారం వెల్డింగ్ దుకాణం నుంచి దుర్వాసన వస్తుండటంతో ఓ వ్యక్తి షెడ్‌ను తెరిచి చూశాడు. పైకప్పున ఉండే ఐరన్‌రాడ్‌కు ప్లాస్టిక్ వైర్తోఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిగమనించి సదరు వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.