Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తొలగించిన బీడీఎల్ మేథాలి ఎంటర్ ప్రైజెస్ కాంట్రాక్టు ఉద్యోగులను పనిలోకి తీసుకోవాలని బీడీఎల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ కార్యదర్శి పి.మురళి, క్లస్టర్ కన్వీనర్ ఎస్. కిషన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలవల్ల, కరోనా కారణంగా కాంట్రాక్టు ఉద్యోగులను పని నుంచి తొలగించి వారి పొట్ట కొడుతున్నారని అన్నారు. ఇప్పటికే లాబ్స్, పబ్లిక్ సెక్టార్లలో కాంట్రాక్టు కార్మికులను పనిలో నుంచి తొలగించి వేస్తున్నారని, దీనివల్ల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మికుల పొట్టగొట్టే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీడీఎల్‌లో 13 మంది కాంట్రాక్ట్ కార్మికులు గత 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. కానీ ఎలాంటి సమాచారం లేకుండానే కరోనాబూచి చూపించి పని నుంచి తొలగించారని, దీంతో కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. మేథిల్ ఎంటర్ప్రైజెస్ వారు తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.