Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దికి పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ సహకరించాలని మేయర్ పారిజాత నర్సింహరెడ్డి అన్నారు. 2021-22 సంవత్సరాకిగాను మున్సిపాలిటీకి రూ.8401.69 లక్షల వార్షిక బడ్జెట్‌ను కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. పలు అంశాలపై డివిజన్ల కార్పొరేటర్లు చర్చించారు. ముఖ్యంగా కొత్తగా నియమించిన మున్సిపల్ కార్మికుల విషయంలో చర్చించారు. ప్రతిపక్ష పార్టీలపై అధికార పార్టీ కార్పొరేటర్లు వివక్ష చూపుతున్నారని బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. సమావేశంలో ముందుగా గత శనివారం నక్సల్స్ కాల్పుల్లో అమరులైన వీర జవాన్లకు నివాళిగా ఒక నిమిషం మౌనం పాటించారు. అనంతరం కార్యాలయ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. రానున్న 2021-22 సంవత్సరానికి అంచనా వ్యయం రూ. 8401.69 లక్షలుగా ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ఆమోదానికి సహకరించిన సభ్యులకు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కష్ణ మోహన్ రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి, ఆర్ ఓ చంద్రశేఖర్ రెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఫ్లోర్ లీడర్లు వంగేటి ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.