Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల నుంచి ఏదిబడితే అది షేర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సమాచారం పూర్తిగా చదువకుండా, ఆ న్యూస్ నిజమో కాదో నిర్ధారించుకోకుండా ఏదిపడితే అది షేర్ చేసినా, లైక్ చేసినా మీకు తిప్పిలు తప్పవు. ఫార్వార్డ్ చేసిన ఫోటోలు, సమాచారం తమకు తెలియదు, కుదరదు అంటే జాన్తానై అన్నట్లు పోలీసులు తప్పుడు సమాచారం వైరల్చేసేవారిపై కేసులు నమోదుకు సిద్దం అయ్యారు. వ్యక్తులకు, వ్యవస్థలకు, సమాజానికి భంగం వాటిల్లేలా పోస్టులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఫేక్ న్యూస్ పెట్టే వారితోపాటు గ్రూప్ అడ్మిన్లపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలో స్నేహితులను, బంధువులను ఏప్రిల్‌ఫూల్ చేసేందుకు ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఏకంగా ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తున్నట్లు ఫేక్ జీవో వైరల్ చేయగా, మరికొందరు నిందితులు ఏకంగా పోలీస్‌శాఖలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు నకిలీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంతకు ముందు ఎప్పుడో, ఎక్కడో జరిగి ఘటనలు పాతబస్తీలో జరిగినట్టు వీడియోలను వైరల్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటివి మరికొన్ని సోషల్ మీడియాలో ఇప్పటికీ అక్కడక్కడా వైరల్ అవుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. షేర్చేసిన వారితోపాటు అడ్మిన్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఫేక్ న్యూస్‌గా నిరూపితమైతే
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం నేరం. భారత చట్టాల ప్రకారం శిక్షారుÛ్హలు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసినట్లు నిరూపితమైతే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2008లోని సెక్షన్ 66డి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, 2005లోని సెక్షన్ 54, ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని 153, 499, 500, 505 (1) సెక్షన్ల ప్రకారం వారు శిక్షారుÛ్హలని కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక వ్యక్తిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యక్తి గురించి తప్పుగా ప్రచారం చేయడం చట్టప్రకారం తప్పు. దేశంలో ఏదైనా అనుకోని విపత్తు సంభవించినప్పుడు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, లేదా ఇరు వర్గాలను రెచ్చగొట్టే విధింగా పోస్టులు పెడితే ఇబ్బందులు తప్పవు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 54 ప్రకారం శిక్షారుహలు.
పోలీసుల ప్రత్యేక నిఘా
వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ వేదికల ద్వారా కొందరు కావాలని పోస్టులు పెడుతున్నారు. వాటిని చూస్తున్న చాలా మంది ఆ సమాచారాన్ని పూర్తిగా చదవక ముందే వెంటనే ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఆ సమాచారాన్ని ముందుగా తామే ఇతరులకు షేర్ చేయాలనే ఉద్ధేశంతో అలా చేస్తున్నారు. కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు మరింత నిఘా పెంచారు. ఇందుకోసం ప్రత్యేక నిఘా వ్యవ్యస్థను ఏర్పాటు చేశారు. ప్రధానంగా మహిళలను కించపరిచే విధంగా కామెంట్స్ పెట్టినా, మార్ఫింగ్ చేసిన ఫోటోలను షేర్‌చేసినా, అసభ్యకరమై తీరులో కామెంట్స్ చేసినా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియానేకదా మనం ఏం చెప్పినా చెల్లుతుందనుకుంటే పొరపాటే. మీపై, మీరు పెట్టే పోష్టులపై కూడా నిఘా ఉంటుందని గుర్తించాలి. మీ మెయిల్, గూగుల్‌కు అటాచ్ అయి ఉంటుంది. ఏదైనా సెర్చ్ చేసిన వెంటనే ఆ కీవర్డ్స్ ఆధారంగా ఆటో మెషిన్ ద్వారా మీ పూర్తి వివరాలు నిఘా వర్గాలకు చేరుతాయి.
గ్రూప్ అడ్మిన్లు జాగ్రత్త
గ్రూప్‌లో సభ్యులను చేర్చుకునే ముందు అడ్మిన్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేక్‌న్యూస్‌ను కట్టడి చేయాలి. ముందగానే సభ్యులకు ఫేక్ సమాచారం షేర్ చేయవద్దని చెప్పాలి. అంగీకరించేవారినే గ్రూప్సభ్యులుగా ఏర్పాటు చేసుకోవడం మంచిది. గ్రూప్‌లో ఫలానా ఫేక్ వీడియో, న్యూస్ పెట్టలేదని చెబితే కుదరదని, అడ్మిన్లపైన కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.