Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
కరోనా మహమ్మారి వ్యాపించిన నేపథ్యంలో టెలి మెడిసిన్, డిజిటల్ ఆరోగ్య సేవలకు ఆదరణ పెరిగిందని, దీంతో డయాగస్టిక్స్, ఆరోగ్య పరిశీలన చికిత్స ప్రణాళికల లాంటి విషయాల్లో ఎంఫైన్ పల్స్ ఆస్పత్రులు, ఇండ్లలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఎంఫైన్ సీఈఓ అజిత్ నారాయణ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశంలో ప్రముఖ డిజిటల్ హెల్త్ స్టార్టప్ అయినా ఎంఫైన్ కొత్తగా పల్స్ అనే యాప్ ను ఆవిష్కరించిందని, ఇది ఎస్పీ-02 (రక్తంలో ఆక్సిజన్ సాచ్యురేషన్) ఎంత ఉందో పరీక్షిస్తుందన్నారు. దీని ద్వారా యూజర్లు తమ ఆక్సిజన్ సాచ్యురేషన్ స్థాయిని బట్టి, అవసరమైతే అదనంగా ఆక్సిజన్ తీసుకోవచ్చునన్నారు. స్మార్ట్ ఫోన్లు, ఏఐ ఆధారంగా ఎంఫైన్ పల్స్ యూజర్లు తమ ఫోన్ కెమెరా, ఫ్లాష్ ఉపయోగించి ఆక్సిజన్ సాచ్యురేషన్ స్థాయిని తెలుసుకోవచ్చునని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి వైటల్స్ పర్యవేక్షణ, డయాగస్టిక్స్ టూల్స్‌ను ఏంఫైన్ ఆవిష్కరించనున్నట్లు చెప్పారు..తద్వారా కేవలం స్మార్ట్ ఫోన్ల సాయంతోనే తమ వైటల్స్ (బీపీ లాంటివి) ఎలా ఉన్నాయో పరీక్షించుకునే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.