Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి భూమాఫియా వ్యవస్థపై ముఖ్యమంత్రి మౌనం వీడి వెంటనే స్పందించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రయివేటు వ్యక్తుల భూములపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వేలకోట్ల అక్రమార్జన చేస్తున్న మంత్రిపై నిరంతరం ఫిర్యాదులు వస్తున్న సీఎం స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాజ్యాంగ ప్రమాణాలు సెక్షన్ 3 కింద క్యాబినెట్, ఐఏఎస్/ఐపీఎస్ తదితరులు వ్యాపార లాభదాయక వ్యవహారాలు చేస్తే క్రిమినల్ ప్రాసెసింగ్ ద్వారా ఎంతో మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు జైలు జీవితం అనుభవిస్తున్నారని గుర్తు చేశారు.