Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావుగౌడ్ జన్మదిన వేడుకలు బుధవారం సికింద్రాబాద్‌లో ఘనంగా జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే మోండా మార్కెట్లోని పద్మారావుగౌడ్ నివాసంవద్ద కోలాహలం నెలకొంది. సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్‌లతో సహ పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిలతో పాటు పలువురు కార్పరేటర్లు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ బి. శ్రీనివాస్ రెడ్డి, డీసీపీ మోహన్ రెడ్డితో సహా అధికారులు పద్మారావుగౌడ్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను పద్మారావు గౌడ్ అభిమానులు ఈ సందర్భంగా చేపట్టారు. సితాఫల్‌మండి, మెట్టుగూడ, తార్నాక, బౌద్ధనగర్ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలను టీఆర్ఎస్ నేతలు చేపట్టారు. కరోనా నేపథ్యంలో తన జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకోరాదని నిర్ణయించుకున్నానని పద్మారావు పేర్కొన్నారు. నాలుగు ఎలక్ట్రిక్ వీల్ చైర్స్‌ను వికలాంగులకు అందజేశారు. అభిమానులు, కార్యకర్తల ఆదరాభిమానాలతో నిరాడంబరంగా జన్మదినాన్ని జరుపుకున్నానని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు.