Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం జల్పల్లి మున్సిపల్లో వివిధ కాలనీలో మిషన్ భగీరథ పథకంలో నిర్మించిన తాగునీటి ట్యాంకులను ప్రారంభించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు జల్పల్లి మున్సిపల్లో మెట్రో వాటర్ వర్క్ ద్వారా రెండేండ్లలో రూ.27కోట్ల నిధులతో 146 కిలోమీటర్ల వాటర్ ట్యాంకులు, పైపులైన్ పనులు పూర్తిచేశామన్నారు. ఇంకా కొన్ని కాలనీలో పైపులైన్ పనులను చేయటానికి రూ.15కోట్ల నిధులు అవసరం ఉందని, అందుకుగాను ముఖ్య మంత్రి కేసీఆర్ తో మాట్లాడి నిధుల మంజూరు కోసం కృషి చేసి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యూసూప్ పటేల్, కమిషనర్ డాక్టర్ జి.ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు ఎక్బాల్ ఖలిఫా, శంశోద్దిన్, శంకర్, లక్ష్మీనారాయణ, యాహియా, కో సభ్యులు సూరెడ్డి కష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీలు జనార్దన్, షేక్ అప్జల్, శ్రీనివాస్ గౌడ్, వాటర్ వర్క్ అధికారులు గోవింద్ గౌడ్, వివిధ కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.