Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
గత 30 ఏండ్లుగా వైద్య రంగంలో ముఖ్యంగా సర్జన్ ఫిజీషియన్‌గా రోగ రహిత సమాజం కోసం కృషి చేస్తున్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ప్రొఫెసర్, డాక్టర్ బి.నాగేందర్‌ను బుధవారం తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ కోవిడ్ బారిన పడకుండా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ బ్లడ్ బ్యాంక్ సైంటిఫిక్ ఆఫీసర్ ఠాకూర్ గణేష్ సింగ్, ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ ఉమాకాంత్, బీజేపీ నాయకులు ఐజాక్ రాజ్, కాంగ్రెస్ నాయకులు సి.రాజేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.