Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కేపీహెచ్బీ
జాతీయ జెండాను గౌరవించడం తెలియని పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పుతున్నారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురనగర్లో జాతీయ జెండా ఆవిష్కరించే జెండా దిమ్మెను అపవిత్రం చేసి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పార్టీ జెండా ఆవిష్కరించడానికి ప్రయత్నించగా స్థానిక మహిళలు అడ్డుకుని జాతీయ జెండా గౌరవాన్ని నిలబెట్టారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే మహిళలను అభినందించారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్, వెంకటేష్, మధురనగర్ మహిళలు అంజమ్మ, శోభ, మాధవి, బాలమణి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.