Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
నవతెలంగాణ-అడిక్‌మెట్
మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం అడిక్‌మెట్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయాన్ని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మజ్లిస్ కనుసన్నల్లో టీఆర్ఎస్ పార్టీ నడుస్తూ గ్రేటర్ హైదరాబాద్‌ను దుర్భరమైన స్థితికి తీసుకువచ్చిందన్నారు. అండర్ డ్రెయినేజీ పైప్ లైన్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బీజేపీ కార్పొరేటర్లు హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్, కార్పొరేటర్లు రచన శ్రీ, పావని, బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ గౌడ్, నవీన్ గౌడ్, కిషోర్ కౌడిన్యప్రసాద్, నందు, స్నేహ రెడ్డి పాల్గొన్నారు.