Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్లో ప్రజల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లలోని పైప్‌లు, నల్లాలు, వాటర్ ట్యాంకర్లు, కమ్మోడ్లు, ఫ్లష్ డోర్లను దుండగులు చోరీ చేస్తున్నారు. తద్వారా సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పబ్లిక్ టాయిలెట్లలో కొన్ని నిరుపయోగంగా ఉంటున్నాయి. పరికరాలను చోరీ చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని క్షేత్రాధికారులను జీహెచ్ఎంసీ ఆదేశించింది. చోరికి గురైన పరికరాలను వెంటనే అమర్చి వాటిని ఉపయోగంలోకి తేవాలని పేర్కొంది. తమ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్లన్నింటినీ ప్రతిరోజూ శుభ్రపర్చాలని సంబంధిత సర్కిల్లోని మెడికల్ అధికారులు, డి.ఇలు, ఏ.ఈలు, జవాన్లు, ఎస్.ఎఫ్.ఏలు నిరంతరం పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణఫై పర్యవేక్షణ జరపాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉండేలా సంబంధిత నిర్వహణ ఏజెన్సీలను ఆదేశించారు.