Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో స్థానికులు, కాలనీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం కల్పించేందుకు సంబంధించిన 'పరిచయం' కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ పునరుద్ధరించింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రతిరోజూ తమ పరిధిలోని నగరవాసులను నేరుగా కలిసి పరిచయం చేసుకుంటారు. పారిశుధ్య నిర్వహణలో స్థానిక పౌరుల పర్యవేక్షణ ఉండటంతో మరింత సమర్థ వంతంగా స్వచ్ఛ కార్యక్రమాలు అమలయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమాన్ని పున రుద్ద రించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో తిరిగి ప్రారంభించారు. దాదాపు 21వేల మంది పారిశుధ్య, ఎంటమాలజీ సిబ్బంది తాము విధులు నిర్వహించే ప్రాంతాల్లోని ప్రజలను కలిసి తమకుతాము పరిచయం చేసుకోవడంతో పాటు సెల్ నెంబర్, తమ పర్యవేక్షణ అధికారి వివరాలు అంద జేయడం ఈ పరిచయ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. సిటీలో ఈ పరిచయ కార్యక్రమం రెండు రోజులుగా ముమ్మరంగా జరుగుతోంది. కార్యక్రమ నిర్వహణ బోర్డులను ప్రదర్శిస్తున్నారు.