Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ విజయారెడ్డి
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆరోగ్య తెలంగాణ రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని కార్పొరేటర్ విజయరెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని ఖైరతాబాద్ డివిజన్లోని ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్‌లో గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది, బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మెన్ అనిల్ కుమార్, అధ్యక్షులు జ్ఞానేశ్వర్ యాదవ్, జనరల్ సెక్రెటరీ కిషోర్ కుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.