Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
కొవిడ్ బారి నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని అమీర ్పేట్లోని అస్తర్ ప్రైమ్ హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది సూచించారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా బుధవారం కొవిడ్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది, సుల్తాన్ ఉలూమ్ ఫార్మసీ కాలేజీ స్టూడెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాస్కులు తప్పక ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, కొవిడ్ రూల్స్ పాటించాలని తెలియజేశారు. కార్యక్రమాన్ని ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ కె. సైదులు ప్రారంభించారు. పివి గణేష్, కె.టి. దేవానంద్, అస్తర్ ప్రైమ్ హాస్పిటల్ ఛీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ డా. సతీష్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, మేనేజింగ్ డైరెక్టర్, డా. రఘు, సీనియర్ ఇంటర్వేన్షనల్ కార్డియాలజిస్టు, అస్తర్ ప్రైమ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాజు, సీనియర్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏవీ రావు, మార్కెటింగ్ హెడ్ శ్రీనివాసులు, పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.