Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టయిల్ అపోలో హాస్పిటల్స్ గ్రూపులో భాగమైనటువంటి అపోలో ఫెర్టిలిటీ తన రెండవ అతిపెద్ద స్వీయ స్వతంత్రత కలిగిన అత్యాధునిక సంతాన సాఫల్య కేంద్రాన్ని హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ప్రారంభించింది. సహజంగా గర్భధారణ చేయలేనటువంటి జంటలకు ఇదొక ఆశాకిరణంగా ఉండనున్నదని అపోలో ఫెర్టిలిటీ కొండాపూర్‌లో తన మొదటి ఫెర్టిలిటీ కేంద్రాన్ని అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టయిల్ లిమిటెడ్, గ్రూప్ సిఇఒ చంద్ర శేఖర్సి, యుబిఐ కాలనీలో బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 3లో నూతనంగా ఏర్పాటయిన అపోలో ఫెర్టిలిటీ సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. అపోలో ఫెర్టిలిటీ అండ్ అపోలో క్రెడిల్, సిఒఒ, అనుభవ్ ప్రశాంత్ అపోలో ఫెర్టిలిటీ, ఛీఫ్ ఐవిఎఫ్ కన్సల్టెంట్, డాక్టర్ సునీత ఇలినాని కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. సువిశామైన విస్తీర్ణంలో ఆరోగ్యవంతమైన పిండం ఎదుగుదల కోసం అత్యాధునిక హెపా (హెచ్ఇపిఎ) ఫిల్టర్లు లామినార్ గాలి ప్రసరణ సౌకర్యంతో అన్ని సంతాన సాఫల్య విధానాల కోసమై అత్యంత స్వచ్ఛమైన గాలిని అందించే ఐవిఎఫ్ ల్యాబ్ సదుపాయం కలిగి ఉన్నది. ఎక్కువ ఐవిఎఫ్ కేసులను నిర్వహించిన సుదీర్ఘ అనుభవం కలిగిన వైద్యులు ఎంబ్రియాజిస్టుల బందం ఇక్కడ ప్రపంచస్థాయి సేవలను అందించనున్నది. అపోలో హెల్త్ అండ్ ల్కెఫ్ స్టయిల్ లిమిటెడ్, సిఇఒ చంద్రశేఖర్ సి ప్రారంభోత్సవం మాట్లాడుతూ హైదరాబాద్‌లో అత్యాధునిక ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా గర్వంగా ఉందన్నారు. సంతాన లేమికి సంబంధించిన అన్ని చికిత్సలకు, దేశం తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్సను అందిస్తున్నందున భారత దేశం సంతాన సాఫల్య సంబంధిత చికిత్సలకు ఒక గమ్యస్థానంగా మారింది.
భారతదేశం అంతటా 16 కేంద్రాలతో : మా నిపుణుల బందం మీకు అనుకూలమైన ప్రదేశంలో అందించే సమగ్ర విధానం ద్వారా గర్భధారణను సులభతరం చేస్తుంది.