Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీ నగర్
లింగోజిగూడా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి బదావన్ కాలనీలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మట్టాడుతూ డివిజన్లోని ప్రతి సమస్య నాకు తెలుసు. నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేతో 19 సంవత్సరాలు ఆయన వెన్నంటే ఉండి ఆయన గెలుపు కోసం పనిచేశాను అన్నారు. ఆయనతో పార్టీ మారలేదనే ఒక్క కారణంతో డివిజన్లోని నా ముఖ్య మిత్రుల, కార్యకర్తలతో ఎమ్మెల్యే మాట్లాడుతూ నాకు, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రయత్నం చేయడం శోచనీయం అన్నారు. నా గెలుపును అడ్డుకు నేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసాను, ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఓటమికి కషి చేశారు. అంతా లింగోజీ గూడ డివిజన్ ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. లింగోజీ గూడ డివిజన్ సమస్యలపై పూర్తి అవగాహన నాకు ఉన్నది గనుక సమస్యల పరిష్కారం కొరకు కషి చేస్తాను అన్నారు. ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న ఎన్నికలు అన్నారు. ధనవంతులకు, పేదవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నారు. ఒక్క అవకాశం ఇస్తే అభివద్ధి చేసి చూపిస్తానని రాజశేఖరరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి గెలుపు లో రెండు పర్యాయలు ఎంతో కషి చేస్తే, టీఆర్ఎస్లో తాను చేరలేదని కాంగ్రెస్ ఓటమి కోసం పనిచేయడం అన్యాయం అన్నారు. గెలిపించిన పార్టీని ఓడించాలని సుధీర్‌రెడ్డి తిరుగుతున్నారనీ రాజ శేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పన్యాల జైపాల్ రెడ్డి, శ్రీధర్‌గౌడ్, శానవాజ్, శ్రీకాంత్, అమెల్, రోహిత్, సుధీర్ రెడ్డి, శ్రీనాధ్, సాయి పాల్గొన్నారు.