Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో సర్కారు భూముల కబ్జాపై అధికారుల స్పందన
నవతెలంగాణ-బోడుప్పల్
సర్కారు భూములను ఆక్ర మించి చేపట్టిన నిర్మాణా లపై బుధవారంనాడు నవతెలంగాణలో వచ్చిన కథనానికి మేడిపల్లి మండల రెవెన్యూ అధికారులు అసంపూర్ణంగా స్పందించారు. సర్కారు భూముల పరిరక్షణకు కషి చేస్తున్నామని చెబుతూనే తూతూ మంత్రంగా కూల్చివేతలు చేశారు. బోడుప్పల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 63/26 నుండి 63/36 వరకు గల సర్కారు భూమి కబ్జాదారులకు కాసుల పంటగా మారింది. పెద్ద నాయకులు కబ్జాచేసి నిరుపేదలను మోసం చేసి సొమ్ము చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అయితే సర్కారు భూములపై పర్యవేక్షణ చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేయడంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో సర్కారు భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తారా లేదా చూడాలి.