Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు వెడల్పులో భాగంగా పదే పదే కొలతలు వేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు
- మొదట వేసిన కొలతల ప్రకారమే ఇల్లు నిర్మించుకున్నారని నిర్ధారించిన సర్వేయర్లు
నవ తెలంగాణ-జూబ్లిహిల్స్
యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ మూలమలుపు వద్ద నుండి, రహమత్ నగర్ చౌరస్తా వరకు 80 అడుగుల రోడ్డు వేయుటకు గత సంవత్సరం క్రితం నిర్ణయించి, రోడ్డు వెడల్పులో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి కొంత మందికి నష్టపరిహారం కింద ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసి అధికారులు డబ్బు చెల్లించడం జరిగింది. తొమ్మిది కోట్ల నష్టపరిహారం రావాల్సి ఉండగా కేవలం నాలుగు కోట్లు మాత్రమే ఇచ్చి మూలమలుపులో ఉన్న శ్రీశైలం యాదవ్ ఇంటిని కొంతమేర తొలగించి వేయడం జరిగింది. అయితే నష్టపరిహారం ఇవ్వటంలో అన్యాయం జరిగిందని ఇంటి యజమాని శ్రీశైలం యాదవ్ కోర్టుకు వెళ్లగా, ప్రభుత్వం ఇచ్చిన నష్ట పరిహారం తీసుకుని ప్రజల అవసరాల మేరకు అధికారులు చూయించిన హద్దుల ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని, పూర్తి నష్టపరిహారం కొరకు న్యాయ పోరాటం చేసుకోవచ్చని కోర్టు ఇంటి యజమానికి పూర్తిగా అండగా నిలిచింది. కోర్టు ఆదేశాల మేరకు, జీహెచ్ఎంసీ అధికారుల సూచనల మేరకు తన ఇంటిని సగ భాగం కూల్చివేసి ఇంటి నిర్మాణం చేపట్ట డం జరిగింది. అయితే ఇంటి యజమాని జూబ్లీహిల్స్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్‌పై రాజకీయ కక్షతో స్థానిక కార్పొరేటర్లు జీహెచ్ఎంసి అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ గతంలో చూయించిన హద్దుల కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, పదే పదే అధికారులపై ఒత్తిడి తీసుకుని వస్తు, ఇప్పటికే నాలుగుసార్లు కొలతలు వేయించడం జరిగింది. ఎన్నిసార్లు కొలతలు వేసినా శ్రీశైలం యాదవ్ తన ఇంటి నిర్మాణాన్ని జీహెచ్ఎంసి సర్వేయర్లు చూయిం చిన హద్దుల్లోనే కట్టుకున్నారని నిర్ధారిస్తున్నారు. అయినప్పటికీ గురువారం ఎనిమిదో తారీఖున తిరిగి జీహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ ల్యాండ్ అక్విజేషన్ ఆఫీసర్ వెంకటేష్ ఆదేశాల మేరకు సర్వేయర్ శ్రీనివాసరెడ్డి, దీపక్, గతంలో జోనల్ కమిషనర్ ఆఫీస్ నుండి వచ్చిన ల్యాండ్ అక్విజిషన్ ఇన్స్పెక్టర్ కేశవులు, రిటైర్డ్ సీనియర్ సర్వేయర్ ఎ.జంగయ్య బందంతో కలిసి వచ్చి తిరిగి కొలతలు వేయడం జరిగింది. అన్ని విధాలా కొలతలు వేసిన అధికారులు ఎలాంటి ఆక్రమణలు జరగలేదని, మొదట చూయించిన కొలతల ప్రకారమే శ్రీశైలం యాదవ్ ఇల్లు నిర్మించడం జరిగిందని, నిర్ధారించి వెళ్లిపోవడం జరిగింది. గురువారం జీహెచ్ఎంసి సర్వేయర్లు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎవరు వారికి సహకరించ లేదు. జీహెచ్ఎంసి సర్వేయర్లు యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు కొలతలకు వస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం లేదని, డిప్యూటీ కమిషనర్ రమేశ్, టౌన్ ప్లానింగ్ అధికారులు నవతెలంగాణ ప్రతినిధికి తెలపడం జరిగింది. అదేవిధంగా గురు వారం సర్వేయర్లు కొలతలు వేస్తుండగా, గతంలో మూడుసార్లు వచ్చిన మూడు డివిజన్ల కార్పొరేటర్లు ఈరోజు ఎవరూ కనపడలేదు. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్ట్టర్ రాజశేఖర్ రెడ్డి, సబ్ ఇన్‌స్పెక్ట్టర్లు సిబ్బందితో కలిసి యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌లో ఉదయం 9 గంటల నుండి బందోబస్తు ఏర్పాటు చేసి, సర్వేయర్లు అక్కడి నుండి వెళ్ళిపోయేవరకు ఉన్నారు.