Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారానే ప్రజలను కాపాడగలం
నవ తెలంగాణ -సుల్తాన్‌బజార్
భారతదేశంలో వ్యాక్సిన్ తయారు చేయించే ప్రక్రియ చేపట్టడం మోడీ ప్రభుత్వం మంచి పని చేసిందని ప్రొఫెసర్ కంచే ఐలయ్య అన్నారు. గురువారం కోటి ఈఎన్టి ఆసు పత్రిలో ప్రొఫెసర్ కంచే ఐలయ్య కు రెండో డోస్ వ్యాక్సిన్ అందించిన ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ జయ మనోహరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రజలందరూ మూఢ నమ్మకాలను విడనాడి భయపడకుండా వ్యాక్సిన్‌ను తీసుకోవాలని ప్రజలకు సూచించారు. మన దేశంలోనే భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను తయారు చేయడం మన దేశ ప్రజలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకు రావడం పట్ల కతజ్ఞులై ఉండాలన్నారు. సైన్సు ద్వారానే మనం జనాభాను రక్షించగలం అన్నారు. కరోనా నుండి ఏ ఇతర దేశానికి కాపాడ లేము కనుక ప్రజలందరికీి విజ్ఞప్తిచేస్తున్న వ్యాక్సిన్లు తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి కోరుతున్న కో వ్యాక్సిన్‌ను చాలా పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ ఎమ్ ఓ డాక్టర్ జయ మనోహరి. డాక్టర్ రవిశంకర్. టి. రాజు. శ్రీనివాస్. వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.