Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చెందిన పలువురు నాయకులు నాగార్జునసాగర్ టీిఆర్‌ఎస్ అభ్యర్థి భరత్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారానికి ఇక్కడి నుండి తరలి వెళ్లారు. గత వారం రోజులుగా కంటోన్మెంట్ బోర్డు చెందిన పలువురు నాయకులు మాజీ సభ్యులు ఇంకా పాత బోయిన్పల్లి చెందిన హ్యాట్రిక్ కార్పొరేటర్ నరసింహ యాదవ్‌తోపాటు ఆ డివిజన్ చెందిన పలువురు నాయకులు నాగార్జునసాగర్‌లో ప్రచారాలు చేస్తున్నారు. అక్కడి అభ్యర్థి భరత్ యాదవ్ కు మద్దతుగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చేసిన అభివద్ధి పనులను అక్కడి ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి అంటూ ఇంటింటికి వెళ్లి కరపత్రం అందజేస్తూ వేడుకుంటున్నారు ముఖ్యంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్‌తో పాటు పలువురు నాయకులు గత పది రోజుల నుండి అక్కడే ఉంటున్నారు అక్కడ యాదవుల కమ్యూనిటీ ఎక్కువగా ఉండటం వల్ల కంటోన్మెంటు పాత బోయిన్పల్లి నుంచి అనేకమంది యాదవ్ నాయకులు కూడా తరలి వెళ్లారు. యాదవ్ పాండు యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడి నుండి పదవులు యాదవ సంఘం ప్రతినిధులు కూడా అక్కడ ప్రచారాలు సాగిస్తున్నారు. కాగా గురువారం నాడు వారు అలియ మున్సిపల్ పరిధిలో ఇంటికి వెళ్లి ప్రచారాలు చేశారు.